మొక్కలు మొలిచే విజిటింగ్ కార్డు..

మొక్కలు మొలిచే విజిటింగ్ కార్డు..

పర్యావరణ రక్షణపై ప్రజల్లో అవగాహనా కల్పించడానికి ప్రభుత్వాలు,స్వచ్చంద సంస్థలు చేయని ప్రయత్నమంటూ లేదు.ఫలితంగా ఇప్పుడిప్పుడే ప్రజల్లో పర్యావరణ రక్షణపై అవగాహన పెరుగుతోంది.ఈ నేపథ్యంలో ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ప‌ర్వీన్ క‌శ్వాన్‌ పర్యావరణ సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెంపొందించడానికి వినూత్న ప్రయత్నం చేశారు.ప్లాస్టిక్ విజిటింగ్ కార్డును పూర్తిగా నిర్మూలిస్తూ అట్ట‌ముక్క‌తో త‌యారు చేసిన విజిటింగ్ కార్డును వాడుతున్నారు.ఇది కేవ‌లం ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌ట‌మే కాకుండా ప‌చ్చ‌ద‌నాన్నిస్తుంది. అయితే ఈ విజిటింగ్ కార్డులో పేరు, మెయిల్ ఐడీ త‌ప్ప మ‌రే స‌మాచారం లేదు. ఎందుకంటే దీన్ని త‌న‌కోసం వాడుకోవ‌డం లేదు ప‌ర్వీన్‌. ఈ విజిటింగ్ కార్డు తీసుకున్న ప్ర‌తీఒక్క‌రూ దీనిని భూమిలో పాతిపెట్టాల‌ని కోరారు. దీంతో తుల‌సి మొక్క‌లు మొలుస్తాయి అని చెబుతున్నారు. ఈ కార్డును చూస్తేనే అర్థ‌మ‌వుతుంది నాటిన త‌ర్వాత ఎలా ఉండ‌బోతుందో అని. అంత మంచి ప‌నిని ప్ర‌తి ఒక్క‌రూ పాటిస్తే బాగుంటుంది అంటున్నారు నెటిజ‌న్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos