న్యూఢిల్లీ : అక్రమ ఆస్తుల కేసులో ట్రయల్‌కోర్టు తీర్పును సవాలు చేస్తూ హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విర్బాంధ్ర సింగ్, ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుండి ఢిల్లీ హైకోర్టు జడ్జి గురువారం వైదొలిగారు. ఈ కేసు విచారణ శుక్రవారం మరో జడ్జి చేపట్టనున్నారని జస్టిస్ ముక్తా గుప్తా తెలిపారు. సిబిఐ దాఖలు చేసిన ఈ కేసులో సింగ్, భార్యలపై అభియోగాలు నమోదు చేయాలని గత ఏడాది డిసెంబర్లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై ఇంకా కోర్టు విచారించాల్సి ఉంది.