అమెరికాలో అత్యంత ఖరీదైన ఇల్లు ఇది..

  • In Money
  • January 24, 2019
  • 937 Views
అమెరికాలో అత్యంత ఖరీదైన ఇల్లు ఇది..

న్యూయార్క్: సైటాడెల్ కంపెనీ తెలుసు కదా. ఆ కంపెనీ ఓనర్ పేరు కెన్ గ్రిఫిన్. ఈయనకు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఖరీదైన ఇళ్లు కొనడం అలవాటు. ఈ మధ్యే లండన్‌లో కూడా రూ.870 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నాడు. బకింగ్ హామ్ ప్యాలెస్‌కు దగ్గర్లో ఉండే ఈ 20 వేల చదరపు అడుగుల ఇల్లు ఓ ప్యారడైజ్. కానీ ఇప్పుడు దానిని తలదన్నే మరో ఇంటిని అమెరికాలో కొన్నారు కెన్ గ్రిఫిన్. ఇది అమెరికాలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా ఇప్పుడు గుర్తింపు పొందింది. న్యూయార్క్‌లోని 220 సెంట్రల్ పార్క్ సౌత్‌లోని పెంట్ హౌజ్ ఇది. దీని ఖరీదు 23.8 కోట్ల డాలర్లు (సుమారు రూ.1700 కోట్లు). లండన్‌లో కొన్న ఇంటి కంటే రెట్టింపు ధర చెల్లించి ఈ ఇల్లు కొన్నారు గ్రిఫిన్. న్యూయార్క్‌కు పని మీద వచ్చినప్పుడు ఉండటానికని ఆయన ఈ ఇల్లు కొన్నట్లు సైటాడెల్ ప్రతినిధి వెల్లడించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో తన హాస్టల్ రూమ్‌లో కూర్చొని బాండ్లు అమ్మడం నుంచి మొదలుపెట్టిన గ్రిఫిన్.. ఇప్పుడీ స్థాయికి చేరడం విశేషమే. 1990లో సైటాడెల్‌ను ప్రారంభించారు. 960 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో స్థానం సంపాదించారు. న్యూయార్క్, షికాగోల్లో 50 కోట్ల డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులను గ్రిఫిన్ కొనుగోలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos