పెద్దల మాట కాదనలేక పెళ్లి చేసుకున్న ఓ యువతి అత్తారింటికి వెళ్తూ ప్రియుడిని పిలిపించుకుని భర్త ఎదుటే ముద్దు పెట్టించుకుంది. దీంతో వివాహమై మూడు గంటలు కూడా కాకముందే ఆ పెళ్లి పెటాకులై వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తెలంగాణలోని హుజూరాబాద్‌లో జరిగిందీ ఘటన. హుజూరాబాద్ కు చెందిన యువతికి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కుర్రాడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెద్దలు అనుకున్న ముహుర్తానికే సోమవారం రాత్రి ధూంధాంగా పెళ్లి జరిగింది. అయితే.. ఆమె హుజూరాబాద్ కు చెందిన వంశీ అనే యువకుడ్ని ప్రేమించింది. వారిద్దరి ప్రేమకు బ్రేకులు వేసేలా పెళ్లి జరిగింది. బరాత్‌తో బయలుదేరినట్టు ప్రేమికుడికి యువతి సమాచారం అందించింది. దీంతో జమ్మికుంట రోడ్డులో కాపుకాసిన వంశీ వధూవరులున్న వాహనాన్ని అడ్డగించాడు.కారు దిగిన వధువు ప్రియుడికి పెళ్లైన భర్త ముందే ముద్దు పెట్టేసింది. దీంతో.. వారికేం చేయాలో పాలుపోని పరిస్థితి. తామిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందన్న విషయాన్ని ఇలా చెప్పటంతో.. విషయం రచ్చ రచ్చగా మారింది. విషయం పోలీసు స్టేషన్ కు చేరింది.తనకు వంశీ అంటే ఇష్టమని.. ఇద్దరం ప్రేమించుకున్నట్లుగా లిఖితపూర్వకంగా రాసిచ్చింది. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ చేసినా.. వధువు ఎంతకూ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో.. వరుడు పెళ్లికుమార్తెను పోలీస్ స్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయాడు. వధువు తల్లిదండ్రులు కూడా కూతుర్ని వదిలేసి వెళ్లిపోయారు.పోలీస్ స్టేషన్లో ఒంటరిగా మిగిలిన వధువును కరీంనగర్ లోని స్వధార్ హోంకు తరలించారు. ముద్దు పెట్టుకొని వివాదానికి కారణమైన వంశీపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదంతా జరిగిన సమయంలో అతడు మద్యాన్ని సేవించి ఉండటం గమనార్హం. పె