ఇప్పుడు గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫోక్స్… ఇలా అనేకమైనవి వచ్చి హల్ చల్ చేస్తున్నాయిగానీ మొదట్లో మాత్రం ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ కు ప్రత్యేక స్థానం ఉంది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఎంతో ప్రత్యేక స్థానంతో పాటు ఎంతో మందికి ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ ద్వారా అనేక సదుపాయాలు కల్పించిన IE ను ఇప్పుడు నిలిపివేయవల్సిన సమయం వచ్చేసిందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇప్పుడు అన్ని కొత్త కొత్త టెక్నాలజీతో సదుపాయాలు రావడంతో ఇప్పుడు తెరమరుగు కానుంది.వచ్చే ఏడాది ఆగష్టు 17 నుంచి మైక్రోసాఫ్ట్ కు చెందిన 365 యాప్స్ సేవలు భవిష్యత్తులో ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ కు సపోర్ట్ చేయవని చెప్పారు. ఆఫీస్ 365, వన్ డ్రైవ్, అవుట్ లుక్ వంటివి ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ 11ను సపోర్ట్ చేయవని దీనిని పరిగణలోకి తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.