పవన్ కళ్యాణ్ అభిమానుల చాలా ఇబ్బందులు పడ్డా..

  • In Film
  • August 20, 2020
  • 125 Views
పవన్ కళ్యాణ్ అభిమానుల చాలా ఇబ్బందులు పడ్డా..

స్టార్ యాంకర్ అనసూయకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జర్నలిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. తర్వాత స్టార్ యాంకర్ గా ఎదిగింది. ఇక ‘క్షణం’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో అద్భుతంగా నటించి.. నటిగా ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ షో చేస్తూనే సినిమాల్లో వరుసగా క్రేజీ ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా అలీ హోస్ట్ వ్యవహరిస్తున్న ఓ షోలో అనసూయ గెస్ట్ గా వెళ్లింది. ఈ నేపధ్యంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా టైములో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులకు గురైనట్టు చెప్పుకొచ్చింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పార్టీ పాట కోసం నన్ను సంప్రదించారు. కానీ అప్పటికీ నేను రెండోసారి ఆరు నెలలు గర్భవతిని. దీంతో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో యాక్ట్ చేయలేకపోయాను. కొద్ది రోజుల తరువాత సినిమా రిలీజైంది. ఆ టైంలోనే నేను సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాను.అయితే ‘అత్తారింటికి దారేది’ లో ఆ పార్టీ సాంగ్ లో యాక్ట్ చెయ్యనందుకు సంతోష పడుతున్నాను’ అని ఓ కామెంట్ చేసాను. ‘గుంపులో గోవిందా’ అన్నట్టు ఆ పాట చెయ్యడం వల్ల నాకు కలిసొచ్చేది ఏమీ లేదు అనేది నా ఉద్దేశం. కానీ నా ఉద్దేశం పవన్ ఫ్యాన్స్ అర్దం చేసుకోకుండా నన్ను సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. దాంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను అని అనసూయ చెప్పుకొచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos