ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రం ఆడియో కూడా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. యూట్యూబ్ లో ఈ చిత్రం పాటలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పాటలు అన్ని కలిపి యూట్యూబ్ లో ఇప్పటికే బిలియన్ వ్యూస్ దాటేశాయి. ఇక ఒక్కో పాట కూడా సరికొత్త నెంబర్ కు చేరుతూ సౌత్ ఇండియాలో మరే పాటలకు సాధ్యం కాని వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి.థమన్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ ఆల్బమ్ లోని ప్రతి పాట యూట్యూబ్ లో వందల కొద్ది మిలియన్ ల వ్యూస్ దక్కించుకుంటోంది. రాములో రాముల లిరికల్ వీడియో ఏకంగా 300 మిలియన్ లను క్రాస్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని యూట్యూబ్ వ్యూస్ ను బన్నీ ఈ ఆల్బంతో దక్కించుకున్నాడు.