న్యూ డిల్లీ : పెట్రోలు ధర వరుసగా గురువారం ఆరో రోజూ పెరిగింది. లీటరు పెట్రోలు ధరను 10 పైసల మేరకు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. రాజ ధానిలో లీటరు పెట్రోలు ధర రూ. 81.06కు పెరిగింది. గత వారం రోజుల్లో 57 పైసలు అధికమైంది. డీజిల్ ధర లీటరుకు రూ. 73.62 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో పీపా ముడి చమురు ధర 45 డాలర్లు మించింది. దీంతో ధర పెంచాల్సి వచ్చిందని అధికార్లు తెలిపారు.