తమిళ స్టార్ హీరోలు,నటీనటులపై సంచలన ఆరోపణలు,విమర్శలు చేస్తున్న నటి మీరా మిథున్ తాజాగా హీరో విశాల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.హీరో విశాల్ తనను వివాహం చేసుకోవాలని కోరుతూ మూడేళ్లు తిరిగాడని ఆమె తెలిపింది.
తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని, అయితే, తనకు మాత్రం డబ్బున్న వాళ్లను వివాహమాడటం ఇష్టం లేదని, అందువల్లే తాను విశాల్ ఆఫర్ ను తిరస్కరించానని చెప్పుకొచ్చింది. మీరా మిథున్ వ్యాఖ్యల వీడియోను ఆమె మేనేజర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.గతంలో తమిళ హీరోలు విజయ్, సూర్యలపై వ్యక్తిగతంగా విమర్శలకు దిగడంతో పాటు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపైనా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చేదు అనుభవాలను ఎదుర్కొంది..