సుశాంత్ మృతి కేసును రాజకీయ ఉద్దేశానికి వాడుకుంటున్నారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై హీరోయిన్ రియా చక్రవర్తి చేసిన వ్యాఖ్యలపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు.సుప్రీంకోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్ లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరును ప్రస్తావించడంపై ఆయన మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి రియాకు లేదని చెప్పారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని… అందుకే సుశాంత్ కేసులో రాద్ధాంతం చేస్తున్నారని తన పిటిషన్ లో రియా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ కేసుపై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడాన్ని ప్రస్తావిస్తూ… దీని వెనుక బీహార్ సీఎం జోక్యం ఉందని ఆమె పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై బీహార్ డీజీపీ స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.