న్యూఢిల్లీ: దాదాపు 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టటానికి రాహుల్ గాంధీనే సరైన వ్యక్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఇండియాటుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 23 శాతం మంది రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించారు. పార్టీ పునరుద్ధరణకు ఎవ్వరు బాగా సరిపోతారని ప్రశ్నకు 23 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు 18 శాతం, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ 14 శాతం ఓట్లు దక్కాయి. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడటంతో గత ఆగస్టులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగారు.