కేంద్రాన్ని అడిగి అమరావతిని ఎంపిక చేసారా?

కేంద్రాన్ని అడిగి అమరావతిని ఎంపిక చేసారా?

విజయవాడ : అమరావతి వివాదంలో తమ పార్టీని ముద్దాయిగా చేసేందుకు కొన్ని రాజకీయ పక్షలు ప్రయత్నిస్తున్నాయని భాజపా ఉపాధ్యాక్షుడు విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ ప్రభుత్వం వేరు. బీజేపీ వేరు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అమరావతిని ఎంపిక చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగానే అమరావతిని రాజధానిగి కేంద్రం ఆమోదించింది. అప్పుడు కేంద్రం చంద్రబాబుకు మంచిదా కాదా? ఇప్పుడు పని గట్టుకొని కొందరు మిడిమిడి జ్ఙానంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అమరావతిపై లేఖలు రాస్తున్నారు. గల్లా జయదేవ్, కేశినేని నాని లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పింది. భాజపా కర్నూలు లో ఉన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని చేసిన వినతిని బాబు తిరస్కరించారు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం ఒప్పుకొంది. చంద్ర బాబు, లోకేష్ జూమ్ లో నేతలతో మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి మాట్లాడాలి. తెదేపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల స్క్రిప్ట్ మాత్రం తెదేపాదే. చంద్రబాబు ఉదయం మాట్లాడినదాన్నే సాయంత్రం ఇతర పార్టీల నేతలు మాట్లాడు తున్నారు. గతంలో మోడీని గో బ్యాక్ అన్న బాబు నేడు కంబ్యాక్ అంటున్నార’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos