విశాఖ పట్టణం: ఉత్తర, పశ్చిమ, మధ్య బంగాళా ఖాతం కూడలిలో ఆది వారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దరిమిలా శని, ఆది వారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవ కాశాలు ఉన్నాయన్నారు. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని చెప్పారు.