చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు

చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు

సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఆయన త్వరలోనే తెదేపాలో చేరతారనే ప్రచారం సాగుతోంది. వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆదిశేషగిరిరావు.. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు సీఎంను కలిసిన అనంతరం మీడియాతో ఆదిశేషగిరిరావు మాట్లాడారు. వైకాపాలో విధివిధానాలు నచ్చకే ఆ పార్టీ నుంచి బయటకొచ్చినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని.. అనేక రాజకీయ అంశాలపై సీఎంతో చర్చించానని ఆయన తెలిపారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణపై ప్రకటన చేస్తానని ఆదిశేషగిరిరావు స్పష్టం చేశారు. కొద్దిరోజుల్లో విజయవాడలో కృష్ణ, మహేశ్‌ బాబు అభిమానుల సమ్మేళనం నిర్వహించి అదే రోజు సాయంత్రం తెదేపాలో చేరాలని ఆదిశేషగిరిరావు భావిస్తున్నారు. ఆయనకు తెదేపా నుంచి ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos