వారం రోజులు పిల్లిపై సామూహిక అత్యాచారం..

వారం రోజులు పిల్లిపై సామూహిక అత్యాచారం..

 కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది టీనేజర్స్‌ ఓ పిల్లిపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు. ఈ అత్యంత కిరాతమైన ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌లో వెలుగుచూసింది. వారం రోజులపాటు ఆ టీనేజర్స్‌ దానిపై జరిపిన ఆకృత్యాలకు అది మరణం అంచులకు చేరుకుంది. జెఎఫ్‌కె జంతు సంరక్షణ ఎన్‌జిఒ సంస్థ ఈ దారుణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. జెఎఫ్‌కె జంతు సంరక్షణ సంస్థ తమ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వివరాల ప్రకారం… లాహోర్‌లోని ఓ కుటుంబం ఇటీవల ఓ బుజ్జి పిల్లిని కొనుగోలు చేసింది. ఆ కుటుంబంలోని ఓ మైనర్‌ బాలుడు, అతని ఆరుగురు స్నేహితుల కన్ను దానిపై పడింది. ఈ క్రమంలో అంతా కలిసి ఆ పిల్లిపై వారం రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ పిల్లి మర్మావయవాలు నుంచి నిరంతరం రక్తం, వీర్యం కారడం మొదలైంది. కనీసం తిండి కూడా తినలేక, బాధతో విలవిల్లాడుతూ నిద్ర కూడా పోలేక నరకం అనుభవించింది. ఆ పిల్లి పరిస్థితిని గమనించిన ఓ స్థానిక అమ్మాయి దాన్ని తనకు ఇవ్వాలని, తాను చూసుకుంటానని ఆ టీనేజర్స్‌తో చెప్పింది. అయితే మొదట వారు అందుకు నిరాకరించారు. ఆ తర్వాత మనసు మార్చుకుని పిల్లిని ఆమెకు ఇచ్చేసి వెళ్లిపోయారు. పిల్లిని గమనించిన ఆ అమ్మాయి దాన్ని లైంగికంగా చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించింది. దీనిపై జెఎఫ్‌కె జంతు సంరక్షణ సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జెఎఫ్‌కె జంతు సంరక్షణ అధికారులు ఆ పిల్లిని ఓ వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో పిల్లి చనిపోయింది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos