హోసూరు : హోసూరు ప్రాంతంలో ఘనంగా జరుపుకొనే వరలక్ష్మి పండుగ కేవలం రెండు రోజులే ఉండగా పూల ధరలకు రెక్కలొచ్చాయు. కరోనా ప్రభావంతో హోసూరు ప్రాంతంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో పూల మార్కెట్లన్నీ మూతపడడంతో గత 4 నెలలుగా గిరాకీ లేక రైతులు పండించిన పూలు తోటల్లోనే వదిలేయడంతో తీవ్రంగా నష్టపోయారు. రానున్న శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో పూల ధరలు పెరిగాయి.
హోసూరు పూల మార్కెట్లో కిలో కనకాంబరాలు రూ.వెయ్యి, చామంతి కిలో రూ.3 వందలు, గుండుమల్లి కిలో రూ.3 వందలు, సన్నజాజి కిలో రూ.280కి అమ్ముడు పోవడం తో రైతులకు కాస్త ఊరట కలిగింది. పూల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. ఏదిఏమైనా కరోనా వైరస్ భయం వల్ల ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం లేదని వ్యాపారులు తెలిపారు.