న్యూ ఢిల్లీ : ‘ఒక వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ప్రధాని మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళ వారం ట్విట్టర్లో విమర్శించారు. ‘లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించారు. ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘింస్తున్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఒక నేరగాళ్ల మూక ధ్వంసం చేసింది. లౌకికతత్వమనేది రాజ్యాంగంలో ముఖ్యభాగం. దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాల’ని హితవు పలికారు.