హఠాత్తుగా గర్భం గంటలోనే ప్రసవం..

హఠాత్తుగా గర్భం గంటలోనే ప్రసవం..

కలియుగంలో ఎన్నెన్నో వింతలు జరుగుతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు నిజమేనని రుజువు చేసే ఘటన ఒకటి ఇండోనేషియాలో చోటు చేసుకుంది.ఇండోనేషియాలోని మండలసరీ గ్రామంలో గ్రామంలో 30 ఏళ్ల హెనీ నురేని అనే మహిళ నివసిస్తోంది.అయితే జూలై 18వ తేదీ రాత్రి అకస్మాత్తుగా ఆమెకు వాంతులు అయ్యాయి. ఉన్నట్టుండి కడుపు ఉబ్బడం మొదలైంది. అనంతరం ఓ గంట తర్వాత తీవ్ర నొప్పులు వచ్చాయి. ఆ క్రమంలోనే ఓ గంటకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ దేశంతో పాటు సామజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.అయితే మరో విచిత్రం ఏమిటంటే.. ఆమె 19 నెలలుగా భర్తతో శృంగారంలో పాల్గొనలేదు. ఇలా విచిత్ర ఘటన చోటుచేసుకోవడంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.హెనీకి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 9 నెలలుగా ఆమెకు రుతుస్రావం క్రమం తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ అది ఆగినా ఆమె గర్భవతి అనే విషయం తెలిసేది. 19 నెలలుగా శృంగారానికి దూరంగా ఉండడం ఇలా ఏ విధంగా చూసినా ఆమెకు గర్భం రావడానికి ఆస్కారమే లేదు. అయినా ఆమెకు ప్రసవం కావడం వింతగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos