దారుణమైన చర్యలతో ప్రపంచాన్ని వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దుర్మార్గం మరోసారి బయటకు వచ్చింది. కరోనా కాలంలో విలవిలలాడిపోతున్న తీరును తమకు అవకాశంగా మార్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత ముస్లింలను టార్గెట్ చేసుకుంది. తనకు చెందిన ఆన్ లైన్ పబ్లికేషన్ అయిన వాయిస్ ఆఫ్ హింద్ లో భారత్ మీద తనకున్న కసిని వ్యక్తం చేసింది.భారత్ పై దాడికి కరోనాను ఒక అవకాశంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కరోనా క్యారియర్లుగా ముస్లింలు మారాలని పిలుపునిచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పదిహేడు పేజీల లాక్ డౌన్ స్పెషల్ ఎడిషన్ విడుదల చేసిన సదరు సంస్థ.. నాస్తికుల్ని చంపేయాలని పిలుపునివ్వటం గమనార్హం. భారత్ పై పూర్తిస్థాయిలో దాడి చేయాలని పిలుపునిచ్చింది.ఈ మ్యాగజైన్ కవర్ పేజీ మీద నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారి ఫోటోలతో పాటు.. ఢిల్లీ అల్లర్లను ముద్రించటం చూస్తుంటే.. దేశ ప్రజల్ని అయోమయానికి గురి చేయటంతో పాటు.. మెజార్టీలలో కొత్త అనుమానాల్ని క్రియేట్ చేయటం ద్వారా.. భారత్ లో తాము మరింత బలపడాలన్నది ఆలోచనగా చెప్పొచ్చు. ఎల్లప్పుడూ ఆయుధాలుకలిగి ఉండాలని పిలుపునిచ్చింది.అవిశ్వాసుల్ని చంపే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దన్న సంస్థ.. ‘‘వారిని కొట్టి చంపేందుకు చైన్లు.. తాళ్లు.. వైర్లు సిద్ధంగా ఉంచుకోండి. గాజు లాంటి పదునైన వస్తువులతో సులువుగా చంపే వీలుంది. సుత్తులు.. కత్తెర్లు కూడా ఉపయోగడపతాయి. కరోనా సూపర్ స్పైడర్లుగా మారారు. ముస్లింలు కరోనా వైరస్ వాహకాలుగా మారి పోలీసులకు అంటించాలని.. అవిశ్వాసుల్ని ఎదుర్కొనేందుకు కరోనాను ఆయుధంగా చేసుకోవాలి’’ అంటూ చేసిన సూచనలు చేసింది.