నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం..

  • In Film
  • July 27, 2020
  • 149 Views
నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం..

 సామజిక మాధ్యమాల్లో వేధింపులు భరించలేక తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారులు తనను వేధింపులకు గుర్తిచేస్తున్నారని ఆమె ఫేస్​బుక్​లో విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు. గమనించిన స్థానికులు ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ”ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర మనోవేదనకు గురవుతున్నా. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా. నా చావు కనువిప్పు కావాలి. వాళ్ళను అస్సలు వదలొద్దు” అని తెలిపింది. అయితే ఆమెను ఎందుకు వేధిస్తున్నారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos