పుదుచ్చేరి : శాసనసభలో చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ రావడంతో అసెంబ్లీ భవనాన్ని ఖాళీ చేశారు. విపక్ష సభ్యుడు ఎన్ఎస్ జే జయబాల్ కు నిన్న కరోనా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. ప్రధాన భవనం మూసివేశారు. దాంతో అసెంబ్లీ సమావేశాలను అదే ప్రాంగణంలో ఉన్న ఓ తోటలో చెట్టు కింద నిర్వహించాల్సి వచ్చింది. ఇక, ఎమ్మెల్యేకి కరోనా సోకడంతో ఇతర సభ్యులంతా 7 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని పుదుచ్చేరి సీఎం సూచించారు. ఎల్లుండి శాసనసభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి.