దేవాలయంలో చోరీ

దేవాలయంలో చోరీ

హోసూరు : ఇక్కడికి సమీపంలో దేవాలయంలో దొంగలు చొరబడి బంగారు నగలు, హుండీలో ఉన్న డబ్బును దోచుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణగిరి జిల్లా కెలమంగలం పోలీసుస్టేషన్ పరిధిలోని సి.తమండ్ర పల్లి గ్రామంలో అతి పురాతన దేవాలయమైన మారెమ్మ దేవాలయం లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి మెడలో ఉన్న మంగళ సూత్రం, దేవాలయంలో హుండీ పగులగొట్టి సుమారు లక్ష నగదును దోచుకెళ్లారు. శనివారం ఉదయం దేవాలయానికి వెళ్లిన పూజారి గోవిందరాజ్ చోరీ గురించి కెలమంగలం పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos