నేను ట్రంప్‌ను కాదు.. ప్రజల ప్రాణాలే ముఖ్యం

నేను ట్రంప్‌ను కాదు.. ప్రజల ప్రాణాలే ముఖ్యం

ముంబై: కరోనా కట్టడికి ఆంక్షల్ని విధించ కుండా ఆర్థిక ప్రయోజనాలకే పెద్ద పీట వేసేందుకు తాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేటి సామ్నా ప్రతిక ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. ‘ముంబయిలో వ్యాప్తి అదుపులో ఉన్నట్లు భావించి, ఉదాసీనంగా ఉండరాదు. దాని గురించి ఆందోళన చెందు తున్నా. వైరస్ అదుపులోకి వచ్చిందని పలు దేశాలు లాక్డౌన్ ఎత్తేశాయి. మళ్లీ విజృంభించడంతో ఆస్ట్రేలియా వంటి దేశాలు తిరిగి లాక్డౌన్ వైపు వెళ్తున్నాయి. లాక్డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరూ అంటున్నారు.. దీనికి నేను అంగీకరిస్తున్నాను. కానీ, ప్రజలు కరోనా బారిన పడినా లేదా వారు ప్రాణాలు కోల్పోయినా ఈ వ్యక్తులు బాధ్యత తీసుకుంటారా? ఆర్థిక వ్యవస్థ కోసం ప్రజలు మరణాలకు మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ట్రంప్ను కాదు. నా కళ్ల ముందు ప్రజలు బాధపడటం చూడలేను. క్రమంగా ఆర్ధిక వ్యవస్థ పునఃప్రారంభానికి దృష్టి సారిస్తున్నాం. ప్రజలు చాలా అలసిపోయిన మాట వాస్తవమే . అన్నింటినీ ఒకేసారి తెరవడం కుదరదు. దీనికి సత్వర పరిష్కారం లేద’న్నారు. ‘మేము ఆర్మీ సహకారం కోరడంలేదు, క్షేత్రస్థాయిలో ఆస్పత్రులు, వైద్య సదుపాయాల కల్పనకు ప్రయత్నించాం. తరుచూ సమావేశాలు నిర్వహించి, నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తున్నాం. ప్రభుత్వ పని తీరుపై చాలా గర్వంగా ఉంద’న్నారు. అధ్యాత్మిక కేంద్రాల ఆరంభం గురించి ప్రస్తావించినపుడు దేవుడు మనతోనే ఉన్నాడని బదులిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos