సమాఖ్య స్ఫూర్తికి తూట్లు

భోపాల్ : విపక్ష ప్రభుత్వాలను కూల్చడం ద్వారా ‘సమాఖ్య స్ఫూర్తి’ దెబ్బతింటోందని మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ మండిపడ్డారు. నాలుగు నెలల కిందట ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూలదోయడం ప్రజాస్వామ్య చరిత్రలో పెద్ద నేరంగా అభివర్ణించారు. ‘ బేరసారాలు చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను అమ్మేస్తున్న నేతలను మీ పార్టీలోకి, ప్రభుత్వంలోకి తీసుకోరని ఆశిస్తున్నా. మీరు ముందుకు వచ్చి. పడిపోతున్న ప్రజాస్వామ్య విలువలను కాపాడతారని ఆశిస్తున్నాన’ని కమల్నాథ్ శనివారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos