న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘పేదల వ్యతిరేకి’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారంలో ట్విట్టర్ లో విమర్శించారు. కరోనా సమయంలో శ్రామిక్ రైళ్లు నడిపి 429.90 కోటుల ఆర్జించిందని ఆ శాఖ ప్రకటించినందుకు ఘాటుగా స్పందించారు. ‘దేశంపై కరోనా మహమ్మారి అనే మబ్బు దట్టంగా కమ్ముకుంది. ప్రజలు అష్టకష్టాలూ పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం లాభాలను ఆర్జించింది. కరోనా లాంటి విపత్తును లాభంగా మార్చుకుని కేంద్రం సంపాదిస్తోంద’ ని తీవ్రంగా మండిపడ్డారు.