భార్య సర్పంచ్.. భర్త ఉపసర్పంచ్..!

భార్య సర్పంచ్.. భర్త ఉపసర్పంచ్..!

తాజాగా తెలంగాణలో జరుగుతున్న గ్రామపంచాయితీ ఎన్నికలలో ఉహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అద‌ృష్టం వరించి కొందరు చిన్న వయస్సులోనే సర్పంచులుగా ఎన్నికైతే, రిజర్డ్వ్ ఆయన గ్రామాలలో ఆ సామాజిక వర్గానిక చెందిన వ్యక్తి ఒక్కరే ఉండడంతో వారినే పదవి వరిస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భార్యభర్తలు ఇద్దరు సర్పంచ్, ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ పోరులో టీఆర్‌ఎస్ మద్ధతుగా పోటీ చేసిన బాషబోయిన శైలజ 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే వార్డు మెంబర్‌గా పోటి చేసిన ఆమె భర్త బాషబోయిన వీరన్న కూడా గెలుపొందడంతో అతడిని ఉప సర్పంచ్‌ పదవి వరిచింది. దీంతో ఉహించని విధంగా ఓకే ఇంట్లో రెండు కీలక పదవులు లభించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos