వచ్చే నెల నుంచి వెండి తెర వెలుగులు

వచ్చే నెల నుంచి వెండి తెర వెలుగులు

న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లను వచ్చే నెలలో మళ్లీ తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఆ శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమైన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. దీనిపై తుది నిర్ణయాన్ని త్వరలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తీసుకుంటారని చెప్పారు. ప్రేక్షకుల మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా చర్చలు తీసుకోవాలని హోం శాఖను సూచించాం. ఈ చర్యలు తీసుకోవాలని థియేటర్ల యజమానులతో కూడా మాట్లాడతాం. ఇందువల్ల సినిమా థియేటర్ల సామర్థ్యంలో 25 శాతం మంది ప్రేక్షకులు మాత్రమే కూర్చుంటారు. ఇంత తక్కువ మంది ప్రేక్షకులతో సినిమా థియేటర్లు నడపలేమని సినిమా హాళ్ల యజమానులు అంటున్నార’ని విలపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos