తమాషా చేస్తున్నావా పైలట్

తమాషా చేస్తున్నావా పైలట్

న్యూ ఢిల్లీ : ‘ఏం తమాషా చేస్తున్నారా? కేవలం 20-25 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రిఎమ్మెల్యేలతో సీఎం అయిపోతావా? ఎన్నడూ కాలేరు. ప్రజల ముందు తమాషా చేయవద్ద’ని సచిన్ పైలట్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ధ్వజమెత్తారు.శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మీరు ముఖ్యమంత్రి కావాలను కుంటున్నారా? చెప్పండి. ఎందుకు ఈ నిరసన? భాజాపాలో చేరడం లేదని ప్రకటించారు. మరి ఇంకా హర్యాణాలోనే ఎందుకు ఉంటున్నారు? కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేద’ని పైలట్ను సూటిగా ప్రశ్నించారు. ‘మీరేమైనా కొత్త పార్టీని స్థాపించాలని అనుకుంటారా? అయితే చెప్పేయండి. హోటళ్లలో కూర్చొని మాట్లాడటం కాదని, బయటికి వచ్చి మాట్లాడాల’ని సవాల్ విసిరారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా తన రాజ్యాంగ విద్యుక్త ధర్మాన్ని మరిచి పోయారని మండిపడ్డారు. రాజ్యాంగానికి, చట్టానికి నిబద్ధులుగా ఉండాల్సిన గవర్నర్లు , కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నార’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos