లాహోర్ : పలు అవినీతి కేసుల్లో లాహోర్ పరిధిలోని కోట్ లఖ్‌పత్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. గురువారం ఉదయం వైద్యుడు మాట్లాడుతూ… గుండె సంబంధిత సమస్యతో నవాజ్ బాధపడుతున్నారని, తక్షణమే నవాజ్ ను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నవాజ్ ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.