ముంబై: ‘2014లో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం భాజపాకు ఎన్సీపీ బయట నుంచి మద్దతు ఇస్తుందని ప్రకటించడం. ఎన్డీఏ నుంచి శివసేనను దూరం చేసేందుకు వేసిన రాజకీయ ఎత్తుగడ. భాజపా, శివసేన మధ్య దూరాన్ని పెంచేందుకు తాను ప్రయత్నించినట్లు’ ఎన్సీపి అధినేత శరద్ పవార్ అంగీకరించారు. సామ్నా పత్రిక ముఖాముఖిలో సమకాలీన రాజకీయాల గురించి విస్తారంగా మాట్లాడారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా తో ముఖాముఖి అనేక విషయాల్ని వెల్లడించారు. ‘ నిరుడు శాసనసభ ఎన్నికల అనంతరం భాజపా నేతలతో మంతనాలు జరిగి మళ్లీ వెనక్కు మళ్లారని తీసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన ఆరోపణలో నిజం లేదు. కొందరు భాజపా నేతలు నాతో, నా సన్నిహితులతో సంప్రదింపులు జరిపారు. ప్రధానితో మంచి సంబంధాలు ఉన్నందున అనుమతి తెలపాలని కోరారు. మోదీని కలిసి తమ వైఖరిపై స్పష్టత నిచ్చాను. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవార్ భాజపా నేతలతో మంతనాలు జరి పారని ఫడణవీస్ పేర్కొనటంలో నిజం లేదు. ఆయన స్థానం ఎక్కడ? జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఆయనకు ప్రాధాన్యం ఉందని నేను నమ్మటం లేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు ఆయన ఎవరికీ తెలియదు. మాజీ ముఖ్యమంత్రి అధికారం కోల్పోవటం జీర్ణించుకోలేకపోతున్నారు. అది మంచిది కాదు. ‘మహా’లో ఆపరేషన్ కమల్ పనిచేయదు..ఇతర రాష్ట్రాల తరహాలో ఆపరేషన్ కమల్ మహారాష్ట్రలో పని చేయదు. పవార్. ఠాక్రే ప్రభుత్వం పూర్తి పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుంది. మహా వికాస్ అఘాడి ఆ తర్వాతి ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తుంద’ని స్పష్టం చేశారు.