ప్రియాంక చొరవతో దిగివచ్చిన సచిన్‌ పైలట్‌

ప్రియాంక చొరవతో దిగివచ్చిన సచిన్‌ పైలట్‌

న్యూ ఢిల్లీ: రాజస్థాన్ పాలక పక్ష రాజకీయాలు వేగంగా మారాయి. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు సచిన్ పైలట్ మెత్త బడ్డారు. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న పైలట్ తో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంతనాలు జరిపారు. గహ్లోత్, పైలట్ మధ్య రాజీ కుదిర్చారు. పార్టీ చీఫ్గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులతో పాటు కీలక ఆర్థిక, హోం శాఖలను కట్టబెట్టాలనేది పైలెట్ డిమాండు. దీనిపై రెండు వర్గాల నేతలతో నాయకత్వం ప్రతినిధులు సంప్రదింపులు జరుపు తున్నారు. అంతకుముందు ఢిల్లీ, జైపూర్ వేదికగా పార్టీలో రాజకీయ హైడ్రామా చోటుచేసుకుంది. 200 మంది సభ్యులున్న రాజస్తాన్ శాసనసభలో కాంగ్రె స్కు ప్రస్తుతం 107 మంది, భాజపాకు 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos