రషీద్ ఖాన్ పై పేలుతున్న సెటైర్లు

  • In Sports
  • July 13, 2020
  • 166 Views
రషీద్ ఖాన్ పై పేలుతున్న సెటైర్లు

ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ పై సామజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి.ఆఫ్ఘనిస్థాన్ అధికారిక రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్ళికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సామజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రశ్న ఎదురు కాగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడే పెళ్లి చేసుకుంటానని బదులిచ్చాడు.రషీద్ చేసిన ఈ వ్యాఖ్యలను పాక్ జర్నలిస్ట్ సాధిక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.వరల్డ్ కప్ గెలిచేందుకు ఇదేమీ లూడో వరల్డ్ కప్ కాదని, రషీద్ తన మాటపై నిలిస్తే జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలి పోవాల్సిందేనని, జరగని పనుల గురించి మాట్లాడవద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos