శ్రీనగర్ : అనంత్నాగ్ జిల్లా, శ్రీ గుఫ్వారా ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది ఒకరు మరణించినట్లు సైనిక అధికార్లు తెలిపారు. ఉగ్ర వాదుల కోసం అక్కడకు వెళ్లిన బలగాలపై ఉదయం 6.40 గంటల సమయంలో కాల్పులకు పాల్పడ్డారు. దీన్నీ తిప్పికొట్టిన సైనికులు ఒక ఉగ్రవాదిని మట్టు బెట్టారు. గాలింపులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.