ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభ మయ్యాయి . ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా బలపడి 36,917 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లకుపైగా లాభంతో 10,851 వద్ద ఉన్నాయి. ఆర్థిక, లోహ రంగాలు సహా హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తు న్నాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.