విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, టి.డి.జనార్దన్ కలిశారు. ఈరోజు సాయంత్రం రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లిన తెదేపా నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 25న రాధా తెదేపాలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ ఇటీవలే వైకాపాను వీడిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో కృష్ణా జిల్లాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాధాకృష్ణ చేరికతో విజయవాడ నగరంలో తెదేపా మరింత బలపడుతుందని తెదేపా నేతలు భావిస్తున్నారు.