మాతృ భాష పరీక్షల్లో లక్షల మంది విఫలం

మాతృ భాష పరీక్షల్లో లక్షల మంది విఫలం

లక్నో: హిందీకి పట్టు గొమ్మగా భావించే ఉత్త శనివారం వెలువడిన పది, ఇంటర్ ఫలితాల్లో 7.97 లక్షల మంది విద్యార్ధులు హిందీ పరీక్షల్లో నెగ్గలేదని బోర్డు అధికారులు తెలిపారు. 2.70 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 5.28 లక్షల మంది ఉన్నత పాఠశాల విద్యార్ధులు మాతృభాష పరీక్షల్లో కనీసం పాస్ మార్కులు కూడా సాధించలేదు. 2.39 లక్షల మంది హైస్కూల్, ఇంటర్ విద్యార్ధులు అసలు హిందీ పరీక్షకు హాజరు కాలేదు. ‘చాలా మంది విద్యార్ధులకు ఆత్మ విశ్వాస్ వంటి సాధారణ పదాలకు కూడా అర్థం తెలియదు.. హిందీ వల్ల భవిషత్తులో ఉపాధి అవకాశాలేవీ లేవన్న భావన వల్లే భాషను నిర్లక్ష్యం చేస్తున్నార’ని మూల్యాంకనం చేసిన అధ్యాపకురాలు ఒకరు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos