న్యూ ఢిల్లీ : చైనాతో వివాదంపై పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘సమాచారాన్ని దాచడం సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదు. చైనాతో సమస్య ముదరకుండా తగిన చర్యలు తీసుకోవాలి. గల్వాన్లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణకు సంబంధించి భారత ప్రభుత్వం నిజాలను దాడిపెడుతోంది. వాస్తవ సమాచారాన్ని ఇవ్వడం లేదు. తప్పుడు సమాచారం ఇవ్వడం సమర్థవంతమైన నాయకత్వానికి శోభనివ్వదు. నిజా నిజాలను ప్రజల ముందుంచాలి. అమరవీరుల త్యాగాలను వృధాపోనీయకూడదు. జవాన్ల త్యాగాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అమరజవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాల’ని మన్మోహన్ సింగ్ డిమాండు చేసారు.