మణిపూర్ భాజపా సర్కార్కు గండం

మణిపూర్ భాజపా సర్కార్కు గండం

ఇంఫాల్: మణిపూర్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత, మాజీ ముఖ్య మంత్రి ఇబోబి సింగ్ గురువారం ఇక్కడ తెలిపారు. త్వరలోనే భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడతా మన్నారు. ముగ్గురు భాజపా శాసనసభ్యులు పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరినట్లు విలేఖరులకు తెలిపారు.భాజపా ప్రభు త్వానికి దూరమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) మంత్రులు ముగ్గురితోనూ ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు చెప్పా రు.‘ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వంపై మా పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుంది. సాధ్యమైనంత త్వరగా శాసన సభను ప్రత్యే కం గా సమావేశ పర్చాలని స్పీకర్ యుమ్నమ్ కెంచంద్ సింగ్ను కోరతామ’ని ఇబోబి సింగ్ పేర్కొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos