అమరావతి: ‘విపక్షం గొంతు నొక్కేస్తున్నారు. పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నార’ని ఆరోపించినన తెలుగు దేశం పార్టీ మంగళ వారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని బహిష్కరించింది. నల్ల చొక్కాలను ధరించి వచ్చిన తెదేపా అధి నేత, జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు.‘గడచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడా ఏ పనులూ జరగడం లేదు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ భూ కుంభకోణాలకు పాల్పడుతోంది. కేవలం ముసాయిదాల్ని ఆమోదించు కునేందుకు మాత్రమే శాసనసభ సమావేశమవుతోంది. ప్రజా సమస్యలను చర్చించాలన్న చిత్తశుద్ధి జగన్ సర్కారుకు లేద’ని మండి పడ్డారు.