ముంబై : స్టాక్ మార్కెట్ల వ్యాపారాలు సోమవారం నష్టాలతో ప్రారంభమై అలాగే ముగిసాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 552 పాయింట్లు పతనమై 33,228కి, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 9,813 వద్ద నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.22%), సన్ ఫార్మా (1.18%), ఓఎన్జీసీ (0.18%) దండిగా లాభాల్ని గడించాయి. యాక్సిస్ బ్యాంక్ (-4.55%), బజాజ్ ఫైనాన్స్ (-4.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.88%), ఎన్టీపీసీ (-3.87%), టాటా స్టీల్ (-3.61%) బాగా నష్టపోయాయి.