అమరావతిలో పోలీసులు,అటవీ అధికారులపై దాడి

అమరావతిలో పోలీసులు,అటవీ అధికారులపై దాడి

మహారాష్ట్రలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు, అటవీ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. అటవీ రక్షణ కోసం సొంత ప్రాంతాలకు దూరం చేయడంతో పాటు తమకు సరైన పునరావాసం కల్పించకపోవడంతో ఆగ్రహించిన గిరిజనులు ఈ దాడికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలపై కూడా  దాడిచేసి ధ్వంసం చేశారు.  ఈ ఘటన అమరావతి సమీపంలోని మేల్ ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా మేల్‌ఘాట్‌ అటవీ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజనులను అక్కడి నుండి ఖాళీ చేయించిన అటవీ అధికారులు అకోలాలో పునరావాసం ఏర్పాటుచేశారు. అయితే ఈ పునరావాస కేంద్రాల్లో అధికారులు తమకు కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో గిరిజనులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిరోజులయినా తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన అడవిబిడ్డలు అక్కడి నుండి వెళళిపోయేందుకు సిద్దమయ్యారు.ఈ విషయం గురించి తెలుసుకున్న అటవీ అధికారులు పోలీసుల సాయంతో వారిని నిలువరించే ప్రయత్రం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనుల మధ్య ఉద్రిక్తత చెలరేగి ఘర్షనకు దారితీసింది.  ఈ ఆందోళనలో పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులపై కూడా గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 15 మంది పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాలు, ఆపీసులపై కూడా దాడిచేసిన గిరిజనులు ఆస్తులను ధ్వంసం చేశారు.   

తాజా సమాచారం

Latest Posts

Featured Videos