దేశవ్యాప్తంగా క్వారంటైన్లలో ఎంతమంది ఉన్నారో తెలుసా!

దేశవ్యాప్తంగా క్వారంటైన్లలో ఎంతమంది ఉన్నారో తెలుసా!

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా బాధితులు,అనుమానుతులతో పాటు ఇతర దేశాలు,రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలను సైతం రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే దేశవ్యాప్తంగా క్వారంటైన్‌లో ఎంతమంది ఉన్నారనే ప్రశ్నకు ఎవరిదగ్గర సమాధానం లభించలేదు.ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్న వ్యక్తుల సంఖ్యను గుర్తించింది. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో మొత్తం 23 లక్షల మందికి పైగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మే 26 నాటికి మొత్తంగా 22 లక్షల 81 వేలమందిని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు వివరించింది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ ను అమలు చేస్తుండగా.. అధికారిక హోదాలో మినహాయింపు ఉన్న వారిని హోం క్వారంటైన్ కి పంపుతున్నారు.మే 14 నాటికి 11లక్షల 95 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉండగా 12 రోజుల్లోనే సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు కేంద్రం ప్రకటించింది. మే 26 నాటికి మహారాష్ట్రలో 6 లక్షల 2 వేల మంది గుజరాత్ లో 4 లక్షల 42 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్ లో 3 లక్షల 6 వేల మంది బీహార్లో 2.1 లక్షల మంది ఛత్తీస్ గఢ్ లో 1.86 లక్షలు ఆంధ్రపదేశ్ లో 14 వేల 930 మంది క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపింది. ఇకపోతే గతంలో క్వారంటైన్ సమయం 14 రోజులు ఉండగా ..ఇప్పుడు     7 రోజులకు కుదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos