మంత్రి తలసానితో సినీ ప్రముఖులు జరిపిన చర్చలకు తనను పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ భూములు పంచుకున్నారా? అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలను మెగా బ్రదర్ నాగబాబు తప్పుపట్టారు.బాలయ్య కేవలం హీరో మాత్రమే కాదని, ఎమ్మెల్యే కూడా అని… ఆయన వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి తన యూ ట్యాబ్ ఛానల్‌లో నాగబాబు మాట్లాడారు. యనను చర్చలకు పిలవాలని తాను కూడా చెపుతున్నానని అన్నారు.సినీ పరిశ్రమ అంటే ఎన్టీఆర్, చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే కాదని… ఏఎన్నార్, కృష్ణ కుటుంబాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీలు ఉన్నాయని అన్నారు. మీటింగ్ కు, ఫ్యామిలీలకు సంబంధం లేదని చెప్పారు. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. బాలక్రిష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోాలని.. నోటికి ఎంతవస్తే అంత మాట్లాడడం సరికాదని హితవు పలికారు.బాలయ్య మాట్లాడింది చాలా తప్పు అని.. బూతులు కూడా మాట్లాడితే వీడియోలో బీప్ వేశారని.. బాలయ్య కేవలం సినీ పరిశ్రమనే కాదని.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించాడని నాగబాబు నిప్పులు చెరిగారు.భూములు పంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు బాధాకరణమని.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో.. ఏపీకి వెళ్తే తెలుస్తుందని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని సర్వనాశనం చేసింది మీ టీడీపీ వాళ్లేనని నాగబాబు వ్యాఖ్యానించారు. బాలక్రిష్ణ ఏం మాట్లాడిన నోరు మూసుకొని కూర్చోమని.. ఇండస్ట్రీకి బాలయ్య కింగ్ కాదని.. కేవలం హీరోనే అని ఆయన గుర్తు చేశారు. భూములు పంచుకున్నారని ఆయన అంటే… అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని తాను అనగలనని అన్నారు.మరోవైపు, జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే పరిస్థితి ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. నాగబాబుపై బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.