అమరావతి : ఎన్టిఆర్ యూనివర్సిటీ మెడికల్ పిజి సీట్ల కేటాయింపులో ఎస్సి, ఎస్టి, బిసిల ల విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తి సీట్ల కేటాయింపు పై ఆగ్రహించారు. క్లాజ్-8 పేరిట విద్యార్థులకు రిజర్వేషన్ సీట్లను కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని వాజ్యంలో కక్షిదారు ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా సీట్లు ఎలా కేటాయిస్తారని న్యాయమర్తి ప్రశ్నించారు. గతంలో దీనిపై కోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమితి ఏమైంది? దాని సిఫార్సులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. ఈ విధంగా సీట్ల కేటాయింపు సరికాదని త్వరలో ఆదేశాలు ఇస్తామని తెలిపారు. వర్సిటీ తరఫు న్యాయవాది ప్రతిస్పందనకు సమయం కోరారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.