దేశంలో కరోనా విజృంభణకు కారణమైన విదేశాల నుంచి వచ్చిన తగ్లిబీలకు ఐదేళ్ల జైలుశిక్ష విధించవచ్చని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.అప్పటివరకు కరోనా కేసుల సంఖ్యలో ఎక్కడో అట్టడగున ఉన్న భారత్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి ఢిల్లీలో నిర్వహించిన తగ్లిబీ సమావేశమే కారణంగా నిలిచింది.దీనిపై విచారణ జరిపిన పోలీసులు వివిధ దేశాల నుంచి ఇండియాకు టూరిస్ట్, ఈ– వీసాలపై వచ్చిన దాదాపు 960 మంది, వీసా నిబంధనలను ఉల్లంఘించి, ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారని, వీరికి ఐదు సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించవచ్చని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విదేశీయులను విడిచి పెట్టాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రారంభించగా, పోలీసులు తమ వాదనను వినిపించారు.వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారేనని, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి, దేశంలో కరోనా వ్యాప్తికి కారకులయ్యారని, వీరు ఇండియన్ ఫారినర్స్ యాక్ట్, సెక్షన్ 14 ప్రకారం నేరస్తులేనని తెలిపారు. పోలీసుల తరఫున వాదనలకు హాజరైన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జాయ్ టిర్కే, వీరంతా 2019 నాటి వీసా మాన్యువల్ విధానాలను పాటించలేదని స్పష్టం చేశారు.