ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారాలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 241 పాయింట్లు లాభపడి 30,921 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 9,117 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.28 వద్ద ఆగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్ని గడించాయి. భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, హీరో మోటోకార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, హిందూస్థాన్ పెట్రోలియం, గెయిల్ షేర్లు నష్టాల పాలయ్యాయయి.