హొసూరు ఇరుకు రోడ్డులో ప్రజల ఇబ్బందులు

హొసూరు ఇరుకు రోడ్డులో ప్రజల ఇబ్బందులు

హోసూరు : పట్టణంలోని ఎంజి రోడ్డులో ఇరువైపులా ద్విచక్ర వాహనాలు నిలిపి ఉంచడంతో పట్టణ ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. హోసూరు ఎంజి రోడ్డులో వస్త్ర దుకాణాలు, నగల షాపులు, సబ్ రీజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఎంజి రోడ్డులో ఇరువైపులా ద్విచక్ర వాహనాలను పార్క్ చేయడంతో స్థానికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజి రోడ్డు అసలే ఇరుకుగా ఉన్నందున, రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్క్ చేయడం వల్ల మరింత ఇరుకుగా మారిందని స్థానికులు వాపోయారు. తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నదని తెలిపారు. ఎంజి రోడ్డులో ఒక పక్కగా వాహనాలను పార్క్ చేయడం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగదని స్థానికులు సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాహనాలను ఒక పక్కగా నిలిపే విధంగా చర్యలు చేపట్టి, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos