అంచెట్టి, పరిసరాల్లో వర్ష బీభత్సం

అంచెట్టి, పరిసరాల్లో వర్ష బీభత్సం

హొసూరు : కృష్ణగిరి జిల్లా అంచెట్టి, నాట్రామ్ పాళ్యం పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు గాలి ఎక్కువగా వీయడంతో విద్యుత్ స్తంభాలు, పెద్ద వృక్షాలు కూకటి వేళ్లతో నేలకొరిగాయి. శుక్రవారం సాయంత్రం నాట్రామ్పాళ్యం సమీపంలోని పంజల్ తునై గ్రామంలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా గ్రామంలోని పలు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు పాడి పశువుపై విద్యుత్ స్తంభం కూలడంతో తీవ్రగాయాలయ్యాయి. వర్ష బీభత్సం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోయారని స్థానికులు వాపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos