తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం తమిళనాడులో 23 చోట్ల ఉన్న ‘నిరర్థక’ ఆస్తులను విక్రయించదలచింది. ఇందుకు ఎనిమిది సమితుల్ని నియమించింది. స్వామివారి ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శలూ వెలువడ్డాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన హెచ్చరించింది.