న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థను కుంగి నందుకు ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం వ్యాఖ్యానించారు. ‘మీ బాధ్యతను మీరు నిర్వర్తించండ’ని కేంద్రానికి నిర్మొహమాటంగా చెప్పాలని మాజీ ఆర్థికమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం భారత రిజర్వు బ్యాంకుకు సలహా ఇచ్చారు. కరోనా లాక్డౌన్తో సంక్షోభానికి గురైన ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభిం చేందుకు సరైన చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రాన్ని కోరాలన్నారు.రు. జిడిపిలో ఒక్క శాతమే ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించారని ఆర్బిఐ పేర్కొన్నా జిడిపిలో పది శాతం ఉద్దీపన ప్యాకేజీగా ప్రటించామంటూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లు గొప్పలు చెప్పుకోవాటాన్ని దుయ్యబట్టారు. డిమాండ్ పడిపోవడంతో 2020-21 వృద్ధి తగ్గుతుందని ఆర్బిఐ గవర్నర్ శశికాంత్ దాస్ చెప్పారన్నారు. ఆయన ద్రవ్యతను వినియోగంలోకి తేవాలని ఎందుకు కోరుతున్నారని చిదంబరం ప్రశ్నించారు.